Chikkadpally: చిక్కడపల్లిలో పోలీస్ వారి కళా జాతర, వివిధ అంశాలపై అవగాహన!

Chikkadpally: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం చిక్కడపల్లిలో పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత మరియు చట్టాలపై అవగాహన కార్యక్రమం.

SALEEM, BANSWADA
Published on: 6 Oct 2026 7:08 AM IST
Chikkadpally
X

Chikkadpally: చిక్కడపల్లిలో పోలీస్ వారి కళా జాతర, వివిధ అంశాలపై అవగాహన!

Chikkadpally: నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య IPS , ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం,ఆరోగ్య శాఖా వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిక్కడ్ పల్లి గ్రామంలోపోలీస్ వారి కళాబృందం చే చక్కని నాటిక,పాటలతో గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అత్యవసర సమయంలో డయల్ 112 కు ఫోన్ చెయ్యాలని, బాల్య వివాహాలు చేయడం నేరమని,నిరోధించడం వలన మాత శిశు మరణాలను తగ్గించ వచ్చని,ఆలాగే ఆరోగ్యం -మూడ నమ్మకల పై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు, గంజాయి కి దూరంగా ఉండాలనీ, రోడ్డు భద్రత లో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించి వివరించారు.

మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలి- హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని తెలిపారు. జీవించు జివించ నివ్వు-అని రోడ్డు భద్రత నియమాలు పాటించాలని,ఆలాగే ఆటో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతు వాహనము నడపకూడదని. అతివేగంగా, రాంగ్ రూట్లో, మద్యం సేవించి, వాహనాలు నడప కూడదని తెలిపారు.

సైబర్ నేరగాళ్ల వలలో పడకండి జాగ్రత్తగా ఉండాలనీ. ఒక వేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930 కి ఫోన్ చేయాలని, గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మెలగాలని, అన్ని పండగలు స్నేహ పూర్వకంగా జరగాలని, సుఖ సంతోషాలతో మెలగాలని సూచించారు.

ఆపద సమయంలో డయల్ 100 ఉపయోగించుకోవాలనీ కళాజాత ప్రదర్శనలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ ASI సత్తయ్య గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA