Balkonda: బాల్కొండలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కొవ్వొత్తుల ర్యాలీ!
Balkonda: నిజామాబాద్ జిల్లా బాల్కొండ సర్కిల్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ. సీఐ జాన్ రెడ్డి, ఎస్సైలు మరియు సిబ్బంది హాజరు.
Balkonda: బాల్కొండలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కొవ్వొత్తుల ర్యాలీ!
Balkonda: పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని బాల్కొండ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బాల్కొండ సర్కిల్ పరిధిలో బాల్కొండ ముప్కాల్ మెండోరా వేల్పూర్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరులైన పోలీస్ సేవలను గుర్తుచేస్తూ నినాదాలు చేశారు.వారి ఆత్మకూ శాంతికలగాలని అమరులైన పోలీస్ కుటుంబాలకు దైర్యం చేకూరాలని పోలీస్ సిబ్బంది ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాల్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ ఆరాఫత్, వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, ముప్కాల్ ఎస్ఐ కిరణ్ పాల్, పోలీస్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.




