Banswada: కొల్లూరు, తాడ్కోల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!
Banswada: కొల్లూరు, తాడ్కోల్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పోచారం శ్రీనివాసరెడ్డి. సన్న రకానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటన.
Banswada: కొల్లూరు, తాడ్కోల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం!
Banswada: బాన్సువాడ సొసైటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో, బుడ్మి సొసైటీ పరిధిలోని తాడ్కోల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరి ధాన్యం కోతలు ఇతర జిల్లాలతో పోలిస్తే ముందుగానే ప్రారంభమయ్యాయని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 ప్రోత్సాహక బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యాన్ని క్వింటాలుకు రూ.2,461, కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ.2,441 చొప్పున కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి, పొల్లు లేకుండా, తేమ శాతం 17 శాతంలోపు ఉండేలా సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. తద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు.రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.వారికి కావాల్సిన గన్ని బ్యాగులు, సుథిలీ ,తార్పాలిన్లు,త్రాగు నీరు,టెంట్లు మొదలగు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు,ఏర్వాల కృష్ణా రెడ్డి,గంగారాం,గోపాల్ రెడ్డి,సర్పంచ్ నామ్దేవ్ ,నాగారం సర్పంచ్ రాచప్ప,ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.




