Pitlam: ఘనంగా చిల్లర్గి సహకార సంఘ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం
Pitlam: చిల్లర్గి పిఎసిఎస్ నూతన చైర్మన్గా ధర్మారెడ్డి రాంరెడ్డి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు.
Pitlam: ఘనంగా చిల్లర్గి సహకార సంఘ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం
పిట్లం: పిట్లం (కామారెడ్డి) అరుగలం కస్టపడి వ్యవసాయాన్నే నమ్ముకొని జీవితాలను వెళ్ళాదిసె రైతులకు అండగా ఉంటు మెరుగైన సేవలు అందించడమే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రధాన బాధ్యత అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.
గురువారం పిట్లం మండలం చిల్లర్గి సహకార సంఘం నూతన చైర్మన్ గా ధర్మారెడ్డి రాంరెడ్డి బాధ్యత స్వీకరోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోపాటు డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరై నూతన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా చైర్మన్ తోపాటు పాలకవర్గ సభ్యులకు ప్రమాణం చేయించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే తోట మాట్లాడుతు రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యం గా సహకార సంఘాలను బలోపేతం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆకాంక్షించారు. నూతన చైర్మన్ గా ధర్మారెడ్డి రాంరెడ్డి (న్యాయవాది )బాధ్యతలు స్వీకరించరు.అన్నింటి కన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రధానంగా గ్రామీణ రైతంగానికి కీలకమైన సేవా కేంద్రాలుగా నిలుస్తాయని వారి అవసరాలను గుర్తించి వారికి నిత్యం అందుబాటులో ఉంటు సేవలు అందించాల్సిన పూర్తి బాధ్యత చైర్మన్, పాలకవర్గ సభ్యులపై ఉందని గుర్తు చేశారు.
ప్రధానంగా పంట సాగు విషయంలో అర్హులైన రైతులకు పంట రుణాలు అందించడం లో పూర్తి సహకారం, రుణాల పై అవగాహన కల్పించడం, ఎరువులు, విత్తనాల సరఫరా లో పారదర్శకత పాటించడం, ప్రభుత్వ వ్యవసాయ పథకాల సమాచారాన్ని రైతులకు చేరవెయ్యడం లాంటి అంశాలకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అందాల్సిన సేవలో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తూ వారి నుండి వచ్చే పిర్యాదులను స్వీకరించి వేణు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పిర్యాదు లు పరిష్కరించే విధంగా చూస్తూ సహకార సంఘం కార్యకలాపాల్లో జవాబు దారి తనాన్ని పెంపోందించడం ద్వార రైతులకు మంచి ప్రయోజనం చేకూర్చావచ్చని పేర్కొన్నారు.
కార్యక్రమం లో బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దొడ్ల కవిత ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ కొంగల శంకర్, మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ జి. సౌజన్య రమేష్, వైస్ చైర్మన్ పరమేష్, పిట్లం మార్కెట్ కమిటి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, వైస్ చైర్మన్, బిచ్కుంద మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పాటిల్,బిచ్కుంద మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగనాథ్, కుమ్మరి రాములు, దొర,సర్పంచ్ చంద్ర శేఖర్,మనోహర్ పాటిల్ లతోపాటు సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




