Pitlam: మేక మాంసం తిని 14 మంది అస్వస్థత
Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లంలో దసరా విందులో మేక మాంసం తిని ఫుడ్ పాయిజన్తో 14 మంది అస్వస్థత. బాన్సువాడ, పిట్లం ఆసుపత్రులలో చికిత్స. పరిస్థితి నిలకడ.
Pitlam: మేక మాంసం తిని 14 మంది అస్వస్థత
పిట్లం: పిట్లం (కామారెడ్డి )జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం అన్నారం తండాలో విజయదశమి పండుగ సందర్బంగా ఒకరోజు ముందు నిర్వహించిన విందులో మేక మాంసం బుజించి పుడు పైజన్ కారణంగా పలువురు అస్వస్థత కు గురైన ఘటన చోటు చేసుకుంది.
ప్రతి ఎట మాదిరిగా గత రాత్రి అన్నారం తండాలో నిర్వహించిన మేక మాంసం తిన్న పలువురు అశ్వస్థత కు గురైన వారిలో 10 మంది పెద్దలు, మరో నలుగురు చిన్నారులు అస్వస్థత కు గురయ్యారు. విందులో భోజనం చేసిన వారిలో మొత్తం 14 మందికి వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళన కు గురయ్యారు.
వెంటనే బంధువుల సహాయం తో బాధితులను చికిత్స నిమ్మితం పిట్లం అస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు చిన్నారులను మెరుగైన వైద్యం కోసం బాన్స్ వాడ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. దింతో తండాలో ఆందోళన నెలకొంది. చికిత్స పొందుతున్న బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అస్పత్రి వైద్యుడు డాక్టర్. రవీంద్ర మోహన్ వెల్లడించారు.




