Bodhan: బోధన్ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేసిన పీజీవీపీ కార్యదర్శి!

Bodhan: బోధన్ డిపో నుండి విద్యార్థులకు సకాలంలో బస్సులు నడిపి, ఇబ్బందులు తొలగించాలని కోరుతూ పీజీవీపీ డివిజన్ కార్యదర్శి నిఖిల్ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు.

K RAVI, BODHAN
Published on: 2 Nov 2026 4:38 PM IST
Bodhan
X

Bodhan: బోధన్ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేసిన పీజీవీపీ కార్యదర్శి!

Bodhan: బోధన్ డిపో నుండి సకాలంలో బస్సులు నడిపి విద్యార్థులు నాలుకోవాలని పిజివిపి డివిజన్ కార్యదర్శి నిఖిల్ బోధన్ డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన రెంజల్ మండలం,కందకుర్తి,నీలా, పేపర్ మిల్, సాఠాపూర్ గ్రామాల నుండి బోధన్ పట్టణానికి వెళ్లే కళాశాల విద్యార్థులకు సకాలంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్థులకు విలువైన పాఠ్యాంశాలు అందుకోలేకపోతున్నారని ఆయన గుర్తు చేశారు. రెంజల్ మండలంలో సుమారు వందల మంది విద్యార్థులు బోధన్ పట్టణంలోని పాఠశాలలు కళాశాలలకు విద్యను అభ్యసించేందుకు వెళ్తున్నారని బస్సులు సకాలంలో రాకపోవడంతో పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

తక్షణమే విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని సమయపాలన పాటించడంతోపాటు అదనంగా బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN