Dichpally: పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి: డిచ్‌పల్లి సీఐ వినోద్
Dichpally: డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో రాబోయే పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ వినోద్ పిలుపునిచ్చారు.
Dichpally: పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి: డిచ్‌పల్లి సీఐ వినోద్
నిజామాబాద్ జిల్లా: డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిది లో సి ఐ వినోద్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీ.ఐ వినోద్ మాట్లాడుతూ శాంతి భద్రతలు, ప్రజల మధ్య సోదరభావం, పరస్పర సామరస్యంపై సభ్యులకు సూచనలు చేశారు.
రాబోయే పండుగలు, పండుగ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీ.ఐ వినోద్ సూచించారు.మత సామరస్యాన్ని కాపాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని సూచించారు.DJ లు పూర్తీగా నిషేధం అని, ఎవరైనా పెడితే కేసు నమోదు చేసి చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్.ఐ ఆరిఫ్, పోలీస్ సిబ్బంది,శాంతి కమిటీ సభ్యులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.




