Nizamabad: ఇందల్వాయి కేజీబీవీకి ప్రహరీ గోడ నిర్మించాలి: పీడీఎస్‌యూ డిమాండ్!

Nizamabad: ఇందల్వాయి కేజీబీవీ, తీర్మాన్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలని అదనపు కలెక్టర్ భుజంగరావుకు పీడీఎస్‌యూ నేతలు వినతిపత్రం అందజేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 5 Oct 2026 9:16 PM IST
Nizamabad
X

Nizamabad: ఇందల్వాయి కేజీబీవీకి ప్రహరీ గోడ నిర్మించాలి: పీడీఎస్‌యూ డిమాండ్!

Nizamabad: ఇందల్వాయి మండలం తీర్మాన్పల్లి గ్రామంలోని ZPHS పాఠశాల, ఇందల్వాయి KGBV పాఠశాలలకు ప్రహరీ గోడ నిర్మించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ భుజంగరావు కి ప్రజావాణిలో PDSU ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్, ఇందల్వాయి,డిచ్‌పల్లి మండల కార్యదర్శి ఎం. మున్న కుమార్ మాట్లాడుతూ.. తీర్మాన్పల్లి ZPHS, ఇందల్వాయి KGBV పాఠశాలలకు ప్రహరీ గోడ లేకపోవడంతో పాఠశాల ఆవరణకు సరైన రక్షణ లేకుండా పోయిందన్నారు.

బయటి వ్యక్తులు, పశువులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించే అవకాశం ఉందని, దీనివల్ల విద్యార్థుల భద్రతకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు.ముఖ్యంగా KGBVలో బాలికలు నివసిస్తూ విద్యను అభ్యసిస్తున్నందున వారి భద్రత కోసం ప్రహరీ గోడ నిర్మాణం అత్యవసరమని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కావున తీర్మాన్పల్లి ZPHS, ఇందల్వాయి KGBV పాఠశాలలకు ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసి, వెంటనే నిర్మాణ పనులు చేపట్టేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని PDSU నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా సహాయ కార్యదర్శి అల్గోట్ సృజన్, జిల్లా నాయకులు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD