Vittalwadi: మొక్కజొన్న బాధితుడికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలి: షిండే
Vittalwadi: పెద్ద కొడప్గల్ విట్టల్వాడి తండాలో పంట నష్టపోయిన రైతు జాదవ్ నాందేవ్ను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించి రూ.5 లక్షల పరిహారం డిమాండ్ చేశారు.
Vittalwadi: మొక్కజొన్న బాధితుడికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలి: షిండే
విట్టల్ వాడి (కామారెడ్డి): పెద్ద కొడప్ గల్ మండలం విట్టల్ వాడి తాండకు చెందిన వ్యవసాయ రైతు సాగు చేసిన 8 ఎకరాల మొక్క జొన్న పంటకు మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు మొక్క జొన్న కుప్ప, చేనుకు నిప్పు పెట్టడం తో పూర్తిగా కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ రైతు ను ఆదుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని జుక్కల్ మాజి ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు.
విషయం తెలుసు కున్న మాజి ఎమ్మెల్యే బుధవారం రైతు స్వగృహానికి వెళ్లి ఘటనకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపోయిన రైతును పరామర్శించి ధైర్యం చెప్పారు. వ్యవసాయాన్నే నమ్ముకొని బతికే రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. తన రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట కళ్ల ఎదుటె అగ్నికి అహుతవుతుందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో పంట నష్టాన్ని పరిశీలించి రైతు జాదవ్. నాందేవ్ కు తక్షణమే 5 లక్షల నష్టపరిహారం అందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై స్పందిస్తే రైతు కుటుంబానికి ఆసరా ఉంటుందని పేర్కొన్నారు.
దింతోపాటు పంట కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ బి ఆర్ ఎస్ పార్టీ తరపున ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు.
కార్యక్రమం లోమాజి ఎంపిపి ప్రతాప్ రెడ్డి,బిచ్కుంద మార్కెట్ కమిటి మాజి చైర్మన్ నల్చర్ రాజు శ్రీహరి, సర్పంచ్ బూరి బాయి, శివాజీ రాథోడ్, దీఫ్ చంద్, సావర్ గావ్ మాజి సర్పంచ్ పవర్ కిసాన్, ఆల్ ఇండియా బంజార సేవ సమితి మండల అధ్యక్షుడు జాదవ్.రాజు తదితరులు పాల్గొన్నారు.




