Nizamabad: బోధన్‌లో ప్రకటనలకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

K RAVI, BODHAN
Published on: 28 Nov 2026 2:26 PM IST
Nizamabad
X

Nizamabad: బోధన్‌లో ప్రకటనలకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!

Nizamabad: కొనబోతే కొరివి అమ్మపోతే అడవి అన్న చందంగా రైతుల పరిస్థితి దయానియంగా మారింది. బోధన్ డివిజన్ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అధికారికంగా నిర్వాహకులకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదని రైతుల పేర్కొంటున్నారు.

ప్రభుత్వం ద్వారా ఇంతవరకు ఒక గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. పది రోజుల క్రితం వరకు 3700 క్వింటా చొప్పున కొనుగోలు చేసిన ధాన్యాన్ని దళారులు సిండికేట్ గా ఏర్పడి అమాంతంగా 2600 కు ధరను పడేయడంతో రైతులు ఎటు పాలు పోక సతమతమవుతున్నారు.

జిల్లా సివిల్ సప్లై అధికారుల నిద్రమత్తులో ఉండడంతో కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రకటనలకు మాత్రమే పరిమితం చేశారని అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం ధరలను మార్కెట్లో పూర్తిగా పడేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారు విమర్శలు తలెత్తుతున్నాయి. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాత్రం అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ని బోధన్ డివిజన్ ప్రాంతంలో ఒక గింజ ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన దాఖలాలు లేకపోవడం విడ్డూరం.

గత వారం రోజుల క్రితం జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిబంధనను కఠిన తరం చేయడంతో సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు దడ పుట్టిస్తున్నారు. నిబంధనలు కఠిన తరం ఉండడంతో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేశారు.

నిల్వ ఉన్న ధాన్యం నెల రోజులుగా రోడ్లపై కుప్పలు పోసి ఓపక్క వాతావరణం మబ్బులు కమ్ముకోవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోపక్క మిల్లర్లకు ధాన్యం కేటాయింపు చేస్తున్నట్లు ఒప్పంద పత్రాలను కాగితాలకే సివిల్ సప్లై అధికారులు పరిమితం చేశారు. ప్రతి ఏడాదిలాగా మిల్లర్లకు కేంద్రాల పేర్లను ఇవ్వకపోవడం గమనారహం.

రైతుల పండించిన కొద్దిపాటి ధాన్యాన్ని క్వింటా 2600 చొప్పున దళారుల పాలు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. బోధన్ డివిజన్లోని ఏడపల్లి, రెంజల్, సాలురా, పొతంగల్ కోటగిరి మండలంలో చెందిన, పొడిచెర్ల పొతంగల్, దోమలెడి గి , హే డోలి ప్రాంతాల రైతులు స్థానిక తాసిల్దారులకు బోధన్ ఆర్డీవోకు సైతం సమస్యను విన్నవించారు.

అయినప్పటికీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందనం గా అదికారుల తీరు తయారైంది. కోసిన ధాన్యం ఎక్కడ పెట్టుకోవాలి తెలియక నెల రోజుల నుండి రోడ్లపైనే ధాన్యం నిల్వలతో బిక్కుబిక్కుమంటూ రైతులు కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు స్పందించి బోధన్ డివిజన్లో వెంటనే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపట్టాలని భాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN