Bodhan: బోధన్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన వడ్ల లారీ
Bodhan: బోధన్ బైపాస్ రోడ్డు వద్ద బ్రేకులు ఫెయిలై వడ్ల లోడు లారీ హోటల్లోకి దూసుకెళ్లింది. వినియోగదారులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
Bodhan: బోధన్‌లో హోటల్లోకి దూసుకెళ్లిన వడ్ల లారీ
బోధన్: బోధన్ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు వద్ద గల ఒక హోటల్ వద్ద హోటల్ లోకి లారీ దూసుకెల్లడంతో పెను ప్రమాదం తప్పింది. వల్లలోడుతో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేకులు పనిచేయకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి లారీ దూసుకెళ్లింది. హోటల్ లో ఉన్న ప్రయాణికులు లారీని గమనించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ఎలాంటి ప్రాణానిష్టం జరిగినప్పటికీ హోటల్ ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనాలపై నుండి లారీ దూసుకెల్లడంతో బుల్లెట్ బైక్ ధ్వంసం అయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాణానికి గల కారణాలను తెలుసుకున్నారు.




