Nizamabad: పోతంగల్‌లో మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత!

Nizamabad: నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లో అనారోగ్యంతో మరణించిన మహిళ కుటుంబానికి ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ రూ.5,000 ఆర్థిక సహాయం పంపారు.

SALEEM, BANSWADA
Published on: 24 Nov 2026 2:05 PM IST
Nizamabad
X

Nizamabad: పోతంగల్‌లో మృతురాలి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత!

Nizamabad: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బుల్లోళ్ల హాజయ్య సతీమణి బుల్లోళ్ల మారుబాయి ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ కి తెలుపగా ఆయన మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు.

అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని స్థానిక నాయకుల ద్వారా పంపగా ఆ ఆర్థిక సహాయాన్ని మృతురాలి కుటుంబానికి ఈ రోజు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఇందూర్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మార్కలి ప్రకాష్ పటేల్,పోతంగల్ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓమన్నా పటేల్,కోటగిరి బీ జే పీ పార్టీ మండల అధ్యక్షులు ఏముల నవీన్,రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ,పోతంగల్ మండల సీని యర్ నాయకులు గంధపు హనుమాన్లు,గంధపు మోహన్,

రెండవ వార్డు సభ్యులు సంతోష్ పటేల్,బొంబాయి శంకర్, పత్తి సతీష్ కుమార్,బూత్ అధ్యక్షులు ఎర్రోళ్ల శంకర్, బుల్లోళ్ల లాలయ్య,బుల్లోళ్ల నాగయ్య,సునై జ్ఞానేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA