Nizamsagar: నిజాంసాగర్‌లో ముమ్మర వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై శివకుమార్!

Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో ఎస్సై జె. శివకుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించి, పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.

VEERANNA, JUKKAL
Published on: 22 Nov 2026 8:33 PM IST
Nizamsagar
X

Nizamsagar: నిజాంసాగర్‌లో ముమ్మర వాహనాల తనిఖీలు నిర్వహించిన ఎస్సై శివకుమార్!

నిజాంసాగర్ (కామారెడ్డి): ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై ఆదివారం సాయంత్రం నిజాంసాగర్ ఎస్సై జె. శివకుమార్ ఆధ్వర్యంలో ముమ్మర వాహనాల తనిఖీ చేపట్టారు. జిల్లా ఉన్నతధికారుల ఆదేశాల మేరకు నర్సింగ్ రావ్ పల్లి - నిజాంసాగర్ రహదారి పై పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు.

శాంతి భద్రతల పరిరక్షణ, నేరల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడమే ద్యేయంగా వాహనాల తనిఖీలు చేపడ్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తనిఖీలో భాగంగా ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను అపుతూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

ప్రతి ద్విచక్ర వాహన దారుడు తప్పకుండ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, త్రిబుల్ రైడింగ్ చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. వాహనాదరులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రయాణాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ తోపాటు పొల్యూషన్ పత్రాలను తప్పకుండ తమ వెంట ఉంచుకొని వాహనాలు నడపాలన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL