Nizamabad: డిచ్పల్లిలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) మండల స్థాయి క్రీడా పోటీలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు.
Nizamabad: డిచ్పల్లిలో ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి!
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో SGF మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని, శారీరక, మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు.
ప్రతి విద్యార్థి ఆటలను దినచర్యలో భాగం చేసుకోవాలని, తల్లిదండ్రులు రోజూ రెండు గంటలు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోక్కీడి యాదగిరి, , ప్రధాన ఉపాధ్యాయులు సీతయ్య, రామాలయ కమిటీ చైర్మన్ ఏ జీ దాస్,కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి,అమృతపూర్ గంగాధర్, పొలసాని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, ఉమ్మాజీ నరేష్, మాజీ సర్పంచ్ బుసా సుదర్శన్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దాసరి అశోక్, జనరల్ సెక్రటరీ శేరు లింగం, ఆయా గ్రామాల సర్పంచులు, విద్యాశాఖ అధికారులు, క్రీడ నిర్వాహకులు, విద్యార్థులు క్రీడా కారులు పాల్గొన్నారు.




