Navipet: గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం - యువకుడిని కాపాడిన స్థానికులు

Navipet: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం యంచ వద్ద గోదావరిలో ఆత్మహత్యకు యత్నించిన సాయిరామ్ అనే యువకుడిని స్థానికులు, గంగపుత్ర యువకులు కాపాడారు.

K RAVI, BODHAN
Published on: 5 Oct 2026 4:30 PM IST
Navipet
X

Navipet: గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం - యువకుడిని కాపాడిన స్థానికులు

నవీపేట్: నవీపేట్ మండలం యంచ వద్ద గల గోదావరిలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సాయి రాం అనే యువకుడి ని స్థానికులు కాపాడారు.

ప్రత్యక్ష సాక్షులు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం నరసాపూర్ మండలం రాంపూర్ కు చెందిన సాయిరాం యువకుడు మనస్థాపం చెంది గోదావరి నదిలో దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.

అదే సమయంలో అటుగా వెళుతున్న వంజరి భూమయ్య ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు గమనించి ఎంషా గ్రామస్తులైన గంగపుత్ర సంఘం యువకులకు ఫోన్ చేయడంతో గంగపుత్ర సంఘం యువకులు శ్రీకాంత్, విజయ్ గోదావరి కి చేరుకొని సాయిరాం ప్రాణాలు కాపాడేందుకు నదిలో దూకారు.

సాయిరాం ప్రాణులతో అడ్డుకు చేర్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. యువకుడి ప్రాణాలు కాపాడిన శ్రీకాంత్ విజయాలను స్థానికులు పోలీసులు అభినందించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN