Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 13 Oct 2026 9:23 PM IST
Nizamabad
X

Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈశ్వర్ వీధి దుర్గ మత కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రధాన అర్చకులు కృష్ణమాచారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ.. అన్నపూర్ణాదేవి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ చల్లని చూపుతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ మహోత్సవాల్లో మహిళలు, భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD