Nizamabad: గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి: బీజేపీ పాదయాత్ర!
Nizamabad: గుత్ప ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు.
Nizamabad: గుత్ప ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి: బీజేపీ పాదయాత్ర!
నిజామాబాద్: గుత్ప ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి గుత్ప ప్రాజెక్టు వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో రైతులతో పాదయాత్రగా బయలుదేరారు.
ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. గుత్ప ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, రైతులకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ పనులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలతో జక్రాన్ పల్లి మండలం సాగు నీరు అందిస్తాం అని గత భారస ప్రభుత్వం కాలయాపన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు గడిచిన గుత్ప ఎత్తిపోతల పధకం పనులలో ఎలాంటి పురోగతి లేదని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే మొరం, ఇసుక, ఇటుక బట్టిలో వసూలు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించే సోయి లేదు అని విమర్శించారు. వెంటనే ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి లేదంటే బీజేపీ నేతృత్వంలో రైతుల కోసం ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి , గద్దె భూమన్న, జిల్లా పసుపు రైతులు సంఘం అధ్యక్షుడు పి.తిరుపతి రెడ్డి, అనంత్ రెడ్డి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




