Nizamabad: గుమ్మిర్యాల్ గ్రామంలో 46 మందికి నూతన చేయూత పెన్షన్ల పంపిణీ!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల్ గ్రామంలో మంజూరైన 46 నూతన చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ జైడి కిషోర్ పంపిణీ చేశారు.

VENU, BALKONDA
Published on: 21 Nov 2026 4:52 PM IST
Nizamabad
X

Nizamabad: గుమ్మిర్యాల్ గ్రామంలో 46 మందికి నూతన చేయూత పెన్షన్ల పంపిణీ!

Nizamabad: ఏర్గట్ల మండలములోని గుమ్మిర్యాల్ గ్రామంలో నూతన చేయూత పెన్షన్ల 46మంజూరు కాగా లబ్ధిదారులకు ప్రోసీడింగ్ కాపీలను సర్పంచ్ జమున సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ జైడి కిషోర్ శనివారం గ్రామ పంచాయతీ లో అందించారు.. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం లో ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందేలా మా పాలక వర్గం పని చేస్తోందని అన్నారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగ ఎదురుచూస్తున్న మాకు చేయూత పెన్షన్లు రావడం సంతోషంగా ఉందని ప్రజా ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రి సీతక్క కు నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో కార్యదర్శి రామకృష్ణ, కరోబార్ మారుతి, వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

VENU, BALKONDA

VENU, BALKONDA