Nizamabad: ఎల్నినో ఎఫెక్ట్ - 800 ఎకరాల్లో ఎండిపోయిన వరి పంటలు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో 800 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోయాయి. ఎండిన పంటలను పరిశీలించి, నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్.

SALEEM, BANSWADA
Published on: 5 Oct 2026 4:24 PM IST
Nizamabad
X

Nizamabad: ఎల్నినో ఎఫెక్ట్ - 800 ఎకరాల్లో ఎండిపోయిన వరి పంటలు

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్, శాం రావు తండా, చేలక తండా,చింతల పేట్ తండా శివార్లలో ఎల్నినో ప్రభావం వల్ల,తగిన వర్షాలు కురియకపోవడం తో, సుమారు 800 ఎకరాల వరి పంటలు నీరు లేక ఎండిపోయాయి.ఇది ముందే గట్టు ప్రాంతం.బోర్ మోటార్లు కూడా నీరు ఎత్తిపోయాం లేదు,కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేక, పంటలకు తగినంత నీరు లభించక పోవడంతో,పంటలు ఎండిపోతున్నాయి.

ఎండిన పంటలను బీఆర్‌ఎస్ నాయకులు మోరిల్ శ్రీనివాసరావు బృందం తో వెళ్లి ఈ రోజు పరిశీలించారు.పంట నష్టంతో ఆందోళనలో ఉన్న రైతులను పరామర్శించి, వారికి ఓదార్చి, ధైర్యం చెప్పారు. రైతులకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి తగిన నష్ట పరిహారం ప్రభుత్వం నుండి అందేలా కృషి చేస్తామని రైతులను భరోసా ఇచ్చారు.

అనంతరం పైడిమల్ సబ్ స్టేషన్ వద్ద రైతులకు 24 గంటల త్రీ ఫేస్ కరెంటు ఆటంకం లేకుండ , ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.రైతులను ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.ఎండిన పంటలకు ప్రభుత్వం స్పందించి,వెంటనే ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయలు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరారు.

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి అయితే ఈ దుస్థితి వచ్చేది కాదని రైతులు వాపోయారు.ఈ కార్యక్రమంలో మోరిల్ శ్రీనివాస్ రావు తో పాటు, మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి,వసంత్ రావు,ఆయా తండాల నాయకులు,రైతులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA