Dichpally: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థిని ఎంపిక!
Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గురుకుల బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని మాదరి పవిత్ర జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
Dichpally: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థిని ఎంపిక!
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని మాదరి పవిత్ర జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. చండీగఢ్‌లో నిర్వహించనున్న 70వ నేషనల్ స్కూల్ గేమ్స్ (అండర్-19) సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆమె తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి. మాధవి లత గారు, వైస్ ప్రిన్సిపల్ ఎం. ప్రేమలత గారు, ఫిజికల్ డైరెక్టర్ ఎన్. నీరజ రెడ్డి గారు, పీఈటీ. సప్న గారు ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు చండీగఢ్‌లో ఈ జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రస్తుతం మాదరి పవిత్ర కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతున్నారు. తమ కళాశాల విద్యార్థిని రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాల్ పి. మాధవి లత గారు, వైస్ ప్రిన్సిపల్ ఎం. ప్రేమలత గారు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి పోటీల్లో మాదరి పవిత్ర అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, తెలంగాణ జట్టు విజయంలో మరియు బంగారు పతక సాధనలో కీలక పాత్ర పోషించాలని వారు ఆకాంక్షించారు. ఈ విజయం కళాశాలకే కాకుండా ఆమె కుటుంబానికి ఎంతో గర్వకారణమని పేర్కొంటూ, అధ్యాపక బృందం,సిబ్బంది మాదరి పవిత్ర ను ప్రత్యేకంగా అభినందించారు.




