Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీపీ సాయి చైతన్య!

Nizamabad: విజయదశమి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 19 Oct 2026 3:15 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీపీ సాయి చైతన్య!

Nizamabad: విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యత, సమగ్రతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, మత సామరస్యాన్ని కాపాడుతూ పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు, పోలీసు సిబ్బంది స్నేహపూర్వకంగా, సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD