Varni: వర్ని మండలం కూనీపూర్‌లో భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్!
Varni: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో జరుగుతున్న భూభారతి రీ సర్వే పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పరిశీలించారు.
Varni: వర్ని మండలం కూనీపూర్‌లో భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్!
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లోని కూనీపూర్‌లో భూభారతి రీ సర్వే పరిశీలన సర్వేను వేగవంతం చేయండి.. రైతులకు అండగా ఉండండి. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని కలెక్టర్ సూచన, భూభారతి రీ సర్వేలో భాగంగా వర్ని మండలo కూనీపూర్ గ్రామానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, బోధన్ ఆర్డీఓ విచ్చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ రీ సర్వేను పరిశీలించి, సర్వేను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ బోయిడి లక్ష్మణ్‌తో మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, గిర్దావర్, జీపీవో, మండల సర్వేయర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.




