Varni: భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

Varni: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్‌లో భూభారతి రీ సర్వేను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించి, సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు.

SALEEM, BANSWADA
Published on: 14 Nov 2026 9:49 PM IST
Varni
X

Varni: భూభారతి రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లోని కూనీపూర్‌లో భూభారతి రీ సర్వే పరిశీలన సర్వేను వేగవంతం చేయండి.. రైతులకు అండగా ఉండండి. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించాలని కలెక్టర్ సూచన. భూభారతి రీ సర్వేలో భాగంగా వర్ని మండలo కూనీపూర్ గ్రామానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, బోధన్ ఆర్డీఓ విచ్చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ రీ సర్వేను పరిశీలించి, సర్వేను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. గ్రామ సర్పంచ్ బోయిడి లక్ష్మణ్‌తో మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు వేసుకునేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్, గిర్దావర్, జీపీవో, మండల సర్వేయర్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA