Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో రైస్ మిల్లర్లపై కేసుల పరంపర!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో రైస్ మిల్లర్లపై కేసుల పరంపర. ముందస్తు బెయిల్ ఉన్నా లంచాల కోసం పోలీసులు వేధిస్తున్నారని మిల్లర్ల ఆవేదన; సివిల్ సప్లైస్ రికవరీపై వివాదం.

K RAVI, BODHAN
Updated on: 4 Oct 2026 6:31 PM IST
Bodhan
X

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లో రైస్ మిల్లర్లపై కేసుల పరంపర!

బోధన్: బోధన్ డివిజన్ పరిధిలో రైస్ మిల్లర్లను కేసులు వెంటాడుతున్నాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యాన్ని చెల్లించలేదని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో దాడులు నిర్వహించి కేసులు చేశారు. కొందరు రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు సంసిద్ధంగా ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కొందరు మిల్లర్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది.

గత నెల 10వ తేదీన బోధన్ డివిజన్ పరిధిలోని ఓ మిల్లు యజమానిపై సివిల్ సప్లై, స్థానిక పోలీసులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. కోటి 20 లక్షలు చెల్లించాలని సదరు మిల్లు యజమానిపై ఒత్తిడి తెచ్చారు. బిల్లు యజమాని బంధువుల శుభకార్యానికి వెళ్లానని తాను అందుబాటులో నేనని చెప్పి అధికారులను గడువు కోసం వేడుకున్నాడు.

సదరు మిల్లు యజమాని వద్ద 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సదురు యజమాని రూ. 50, వేలు చెల్లించుకుంటానని తనకు యాంటీ స్పెట్ బెయిల్ ఉందని చెప్పిన వినిపించకుండా యజమానిపై వేధింపులకు గురి చేస్తూ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారి కక్ష సాధింపుతో కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు మిల్లు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లపై ఉక్కు పాదం మోపినప్పటికీ ఇదే అదునగా భావించిన కొన్ని పోలీస్ స్టేషన్ల లో మిల్లు యజమానులపై ఒత్తిడి తెచ్చి డిమాండ్ కు అనుగుణంగా డబ్బులు ఇవ్వకపోవడంతో కేసులు చేస్తున్నారని పలువురు బాధిత మిల్లు ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దాన్యం తమ దగ్గర సరిపడా ఉన్నప్పటికీ నిమిషాల్లోనే డబ్బులు చెల్లించాలని లేని పక్షాన కేసులు చేస్తామని పోలీసులు వేధిస్తున్నట్లు బోధన్ డివిజన్ లో చర్చ నీయంశం గా మారింది. కొందరు మిల్లులో యజమానులు విడుదలవారీగా డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా కేసులు చేయడం ఏంటని పోలీసులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN