Banswada: బాన్సువాడలో దివ్యాంగులకు భరోసా: మాజీ డీసీసీబీ చైర్మన్!

Banswada: బాన్సువాడ నియోజకవర్గంలోని వికలాంగులకు అండగా ఉంటానని మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 13 Oct 2026 5:33 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో దివ్యాంగులకు భరోసా: మాజీ డీసీసీబీ చైర్మన్!

బాన్సువాడ: బాన్సువాడ నియోజకవర్గం లో ఉన్న వికలాంగులకు అందరికీ అండగా ఉంటానని ,మాజీ డీ సీ సీ బీ చైర్మెన్ భాస్కర్ రెడ్డి అన్నారు. అంగ వైకల్యం తో బాధ పడే వారందరికీ తాను అండగా నిలుస్తానన్నారు.అంగ వికలాంగులకు గుర్తించి వారికి కావలసిన కృత్రిమ కాళ్ళు,చేతులు ఆధునిక సాంకేతికతో తయారు చేసిన పరికరాలు తమ స్వంత ఖర్చులతో చేయించి అందజేసి,వారిని ఆదుకుంటామని వారన్నారు.

భాస్కర్ అన్న భరోసా పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా నేటి నుండి అంగ వికలాంగుల వివరాల సేకరణ ప్రారంభించారు.అందులో భాగంగా రుద్రూర్ మండలం లో 10మంది అంగవైకల్యం కలిగిన వారిని గుర్తించారు స్థానిక నాయకులు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నారోజి గంగారాం, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, తొట్ల గంగారాం,తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA