Tanur: తానూర్ ప్రభుత్వ కళాశాలలో గ్రంథాలయం ప్రారంభం!
Tanur: తానూర్ ప్రభుత్వ కళాశాలలో జీడీఆర్ ట్రస్ట్ గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Tanur: తానూర్ ప్రభుత్వ కళాశాలలో గ్రంథాలయం ప్రారంభం!
Tanur: నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఘనంగా ప్రారంభించారు. జీడీఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.
తానూర్ ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రంథాలయాన్ని ప్రారంభించి అందులో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. పోటీ పరీక్షలకు, ఉన్నత చదువులకు ఉపయోగపడే పుస్తకాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. గ్రంథాలయం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




