Jukkal: 161 జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా.. భారీగా స్తంభించిన రాకపోకలు
Jukkal: ఓట్ల తొలగింపు అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎక్స్ రోడ్డు 161వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
Jukkal: 161 జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా.. భారీగా స్తంభించిన రాకపోకలు
జుక్కల్ (కామారెడ్డి): జుక్కల్ ఎక్స్ రోడ్డు 161 జాతీయ రహదారి పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించింది. ఓట్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో 161వ జాతీయ రహదారిపై చేపట్టిన ఈ నిరసనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎక్స్ రోడ్డు 161వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పిలుపు మేరకు జుక్కల్ చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలుపెద్దసంఖ్యలోపాల్గొన్నారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఓటు హక్కును కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని.. ఓటు హక్కును దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్పార్టీసర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, మైనారిటీ విభాగం, వివిధ అనుబంధసంఘాలనాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ధర్నాతో 161వ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు ఇబ్బందులుఎదుర్కొన్నారు.
కార్యక్రమం లో డి సీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, జుక్కల్ నియోజకవర్గం లొని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు, సొసైటీ చైర్మన్ లు, మునిసిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




