Jukkal: జుక్కల్ మండలంలో టీఆర్‌పీ నూతన కమిటీ ఏర్పాటు!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బండివర్ రాజు నియమితులయ్యారు.

VEERANNA, JUKKAL
Published on: 11 Nov 2026 5:46 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్ మండలంలో టీఆర్‌పీ నూతన కమిటీ ఏర్పాటు!

Jukkal: జుక్కల్ (కామారెడ్డి ) టి ఆర్ పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు జుక్కల్ మండల నూతన కమిటీని నియమించినట్లు ఆ పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్,ఇంచార్జి జాదవ్. ఈశ్వర్ తెలిపారు.

పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన మండల కమిటీలనునియమిస్తున్నట్లు ఈశ్వర్ ఓ ప్రకటన లో తెలిపారు. నూతనంగా ఏర్పడ్డ కమిటి సభ్యుల్లో అధ్యక్షుడిగా బండివర్ రాజు, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, జుక్కల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా అందులాగిరి దత్తులను నూతన బాధ్యతలు అప్పగించారు.

పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ బి సి లకు రాజ్యాధికార లక్ష్యమే దిశగా పోరాడుతున్న మల్లన్నకు మద్దత్తు గా ఉంటు పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కర్ని సమన్వయం తో పార్టీని బలోపేతం చెయ్యడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు.

కార్యక్రమం లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండే రావ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL