Armoor: ఆర్మూర్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ సాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా 10టీవీ ప్రతినిధి దూద్వాట్ శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

VAMSHI, ARMOOR
Published on: 25 Oct 2026 2:26 PM IST
Armoor
X

Armoor: ఆర్మూర్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం

అర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ సాటిలైట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా 10 టీవీ రిపోర్టర్ దూద్వాట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సాక్షి టీవీ ప్రతినిధి షాదుల్లా, ప్రధాన కార్యదర్శిగా టీవీ9 ప్రతినిధి చిరంజీవి, వంశీకృష్ణ హెచ్‌ఎం టీవీ ప్రతినిధి, గౌరవ అధ్యక్షులుగా రాజేశ్వర్ గౌడ్ టీవీ5 రిపోర్టర్, సలహాదారులుగా నరేందర్ ఐ న్యూస్ రిపోర్టర్ గా బాధ్యతలు చేపట్టారు.

నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని ప్రతినిధులు తెలిపారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా పాత్ర కీలకమని, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రవణ్, గణేష్ గౌడ్, రాజేష్, అజీమ్,సంతోష్,దిలీప్ గౌడ్, రాకేష్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR