Kamareddy: ఢిల్లీలో ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడిని కలిసిన గులని సాయిలు
Kamareddy: ఢిల్లీలో ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు రాజేంద్ర పాల్ గౌతమ్‌ను టీపీసీసీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ గులని సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు.
Kamareddy: ఢిల్లీలో ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడిని కలిసిన గులని సాయిలు
కామారెడ్డి: పిట్లం (కామారెడ్డి ) ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు , ఢిల్లీ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్‌ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ ) ఎస్సీ విభాగం జనరల్ సెక్రటరీ గులని సాయిలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఎంపీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు గుల్లాని సాయిలు తెలిపారు. రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.




