Bichkunda: బిచ్కుంద తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

Bichkunda: బిచ్కుంద తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఏక్తా దివస్ ఘనంగా నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 31 Oct 2026 3:36 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుంద తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

బిచ్కుంద (కామారెడ్డి): స్వతంత్ర సమరయోధుడు భారత దేశపు ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాన మంత్రి సర్ధార్ వల్ల భాయ్ పాటిల్ జయంతి వేడుకలు బిచ్కుంద తహసీల్దార్ కార్యాలయం లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బిచ్కుంద తహసీల్దార్ బి.వేణు గోపాల్ గౌడ్ సర్ధార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సర్ధార్ పాటిల్ 1875 అక్టోబర్ 31 న గుజరాత్ లో పురుడు పోసుకున్న ఉక్కు మనిషి భారత స్వాతంత్ర ఉద్యమం లో అతి కీలక పాత్ర పోషించారాని దేశానికి స్వాతంత్ర అనంతరం తొలి ఉప ప్రధానిగా, హోం మంత్రి గా బాధ్యతలు నిర్వహించారాని గుర్తు చేశారు.

560కి పై చిలుకు సంస్తానాలను భారత దేశంలో విలీనం చెయ్యడంలో సర్ధార్ పాటిల్ కీలక పాత్ర పోసించి భారత దేశ ఐక్యతకు గట్టి పునాది వేసిన గొప్ప మహా నేతగా వర్ణించారు. అందుకే ఆనాడు అయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ప్రతి ఎట అక్టోబర్ 31 న దేశ వ్యాప్తంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

జయంతి ఉత్సహంలో పాల్గొన్న కార్యాలయ సిబ్బంది, ఇతరులతో కలిసి జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ మిత్ర,చంద్ర శేఖర్, కుశల్, అన్నపూర్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL