Armoor: పసుపు రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాల పంపిణీ
Armoor: ఆర్మూర్ మామిడిపల్లిలో జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు పసుపు బాయిలర్, పాలిషర్ యంత్రాలను చైర్మన్ పల్లె గంగారెడ్డి, అధికారులు పంపిణీ చేశారు.
Armoor: పసుపు రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాల పంపిణీ
అర్మూర్: ఆర్మూర్, మామిడిపల్లి పట్టణం లోని జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించబడినది, పసుపు రైతులకు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పసుపు ఉడకబెట్టడం, పాలిషింగ్ ప్రక్రియలను మరింత సులభతరం చేయడంతో పాటు, ఉత్పత్తి నాణ్యతను పెంపొందించి రైతులకు మెరుగైన ఆదాయం లభించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా రైతులకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల వినియోగంపై అవగాహన కల్పించడం జరిగింది. జాతీయ పసుపు బోర్డు రైతుల సంక్షేమం, పసుపు సాగు అభివృద్ధి, నాణ్యమైన ఉత్పత్తులు మరియు రైతుల ఆదాయ పెంపునకు నిరంతరం కృషి చేస్తుందని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పుసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి , పసుపు బోర్డు సెక్రటరీ శ్రీ భవానీ శ్రీ, IAS , డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రత్యూష్ T.P. , సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ రాజమాణిక్యం , శ్రీమతి రాణి , శ్రీ జవహర్ , జాతీయ పసుపు బోర్డు కార్యాలయ అధికారులు, యంత్రాల లబ్ధిదారులు మరియు పలువురు పసుపు రైతులు పాల్గొన్నారు.
పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా.. పసుపు సాగుకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి జాతీయ పసుపు బోర్డు కట్టుబడి ఉంది.




