Banswada: బాన్సువాడలో ఘనంగా జాతీయ సమైక్య సదస్సు - హాజరైన ఎమ్మెల్యే పోచారం!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన జాతీయ సమైక్య సదస్సు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు.
Banswada: బాన్సువాడలో ఘనంగా జాతీయ సమైక్య సదస్సు - హాజరైన ఎమ్మెల్యే పోచారం!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జాతీయ సమైక్య సదస్సు నిర్వహించారు.ముఖ్య అతిథులుగ డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,పాస్టర్ రాజేశ్వర్ సోలేమాన్ పాల్గొని ప్రసంగించారు.కుల మతాలకు అతీతంగా కలిసి ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుందన్నారు.
అన్ని మత గ్రంథాల్లో అందరూ బాగుండాలి అని వ్రాసి ఉందని తెలిపారు.ఇటువంటి కార్యక్రమాలు చెయ్యడం శాంతిని కోరుకోవడం అన్నారు.ఈ కార్యక్రమం తో జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల ఖ్యాతిని చాటే అవకాశం లభించిందని అన్నారు.
వేరే దేశాల్లో తమ తమ మాతాలకు సంబంధించి ప్రార్థనలు చేసే వీలు లేదు కానీ మన దేశంలో ఎ మతమైన ప్రార్థనలు చేసే హక్కు మన రాజ్యాంగం ఇచ్చిందన్నారు. భారత దేశ ప్రజలు కులమతాలకు అతీతంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముఫ్తీ ఉమర్ ను అభినందించారు.




