Banswada: బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో నశా ముక్త్ భారత్ సదస్సు!
Banswada: బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో నశా ముక్త్ భారత్ అవగాహన సదస్సు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య పిలుపు.
Banswada: బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో నశా ముక్త్ భారత్ సదస్సు!
Banswada: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో మేరా యువ భారత్, ఎన్‌ఎస్‌ఎస్ ల సంయుక్తంగా , బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా ,కళాశాలలో విద్యార్థులకు నశా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ గంగాధర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువత జీవితాలపై వాటి ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మంచి జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని అటువైపు సాగాలని అన్నారు మత్తు వల్ల తాను నాశనం అవుతూ తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది అలాంటి మత్తు జోలికి వెళ్ళకూడదు వెళ్లినచో నేటి రోజుల్లో కఠినాతి కఠినమైన శిక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అని అన్నారు. నశా ముక్త్ భారత్‌పై విద్యార్థులకు నిర్వహించిన పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు.
కార్యక్రమం చివరలో విద్యార్థులకు అధ్యాపకులతో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, ఇతరులకు కూడా అవగాహన కల్పించి, మత్తు రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేరా యువ భారత్ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ సునిల్ రాథోడ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.




