Banswada: బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో ఆనంద్ కుమార్.
Banswada: బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక కొరకు బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపట్టారు.
దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అర్హతలను నిర్ధారించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ పరిశీలనలో ఎంపీడీవో ఆనంద్ కుమార్ వెంట గ్రామ కార్యదర్శి భరత్, సర్పంచ్ అందే రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




