Bodhan: బోధన్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైకిల్ యాత్ర!

Bodhan: బోధన్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైకిల్ యాత్ర. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమంటూ తీవ్ర విమర్శలు.

K RAVI, BODHAN
Published on: 27 Sept 2026 1:22 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైకిల్ యాత్ర!

Bodhan: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మూడు రోజులపాటు పార్లమెంట్ పరిధిలో సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మాజీ సీఎం కేసీఆర్ రైతులను అన్ని విధాల మోసం చేశారని దుయ్యబట్టారు. కెసిఆర్ దొంగ అయితే రేవంత్ రెడ్డి గజదొంగ అని అభివర్ణించారు. వ్యవసాయ నీటిపారుదల రంగాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. కెసిఆర్, రేవంత్ రెడ్డిలు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను అన్ని విధాల మోసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN