Mohammadabad: అంధకారంలో మొహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ.. చీకట్లో మగ్గుతున్న ప్రజలు!

Mohammadabad: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ ఎస్సీ కాలనీలో ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక కాలనీ అంధకారంలో మగ్గుతోంది.

VEERANNA, JUKKAL
Published on: 27 Nov 2026 8:05 PM IST
Mohammadabad
X

Mohammadabad: అంధకారంలో మొహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ.. చీకట్లో మగ్గుతున్న ప్రజలు!

మొహమ్మద బాద్ (కామారెడ్డి): విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం తో విద్యుత్ బల్బులు వెలుగాక కాలనీ మొత్తం అంధకారం కమ్ముకుంది.జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ ఎస్సి కాలనీ లో నెలకొన్న విద్యుత్ సమస్య పై స్పందించాల్సిన విద్యుత్ శాఖ ఉదయం నుండి రాత్రి వరకైనా పట్టించుకోకపోవడంతోపాటు పాటు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహారిస్తుండడం తో రాత్రి సమయంలో అవసరాలకోసం బయటకు వచ్చేందుకు గాను కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు.

ఒక పక్క దోమల బెడద, మరోపక్క విష సర్పల సంచారం పై కాలనీ వాసులు భయాందోళనకు గురౌతున్నారు.కాలనీ లొని విధి లైట్లతోపాటు ఇండ్లలో సైతం విద్యుత్ఇ సరఫరా లేకపోవడం తో కాలనిలో అంధకారంనెలకొంది. ఇదిలా ఉండగా ఉదయం నుండి రాత్రి వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీటి కోసం కాలనీ వాసులు నీటి ఏద్ధడిని ఎదుర్కొంటున్నారు.

కాలనిలో ఉన్న బోరు కు సింగిల్ పేస్ మోటార్ బిగించడంతో ఆ బోర్ కు విద్యుత్ సరఫరా ఉంటేనే బోర్ నీరు వస్తాయని విద్యుత్ సిబ్బంది స్పందించి విద్యుత్ సరఫరా అయేలా తాగు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL