Banswada: పంట కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి!

Banswada: బాన్సువాడ మండలంలో సాగునీటి పంట కాలువలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

SALEEM, BANSWADA
Published on: 5 Oct 2026 9:09 PM IST
Banswada
X

Banswada: పంట కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా,బాన్సువాడ మండలంలోని నాగారం,కొల్లూరు, రైతునగర్ గ్రామాలకు సాగు నీరు అందించే డిస్ట్రిబ్యూటర్ 25 కాలువను బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.మీర్జాపూర్ నుడి రైతునగర్ కు ,కొల్లూరు శివారు లో సాగు నీరు అందించే పిల్ల కాలువను పరిశీలించారు.

రైతులతో,పంట కాలువల్లో నీటి ప్రవాహాన్ని పరిశీలించి,వారితో ముచ్చటించారు.పంటల పరిస్థితిని వారికి అడిగి తెలుసుకున్నారు. నిజాంసాగర్ కెనాల్ ద్వారా సాగు నీటిని మరో రండు రోజులు పొడిగిస్తామని తెలిపారు.ఈ ప్రకటన తో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఎల్బినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని,సాగునీరు,త్రాగు నీరు అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిం చూకోవాలని ,ముందు చూపుతో పొదుపుగా వాడాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA