Banswada: రెండు పాఠశాలల్లో గ్రంథాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లో నూతన గ్రంథాలయాలను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 28 Nov 2026 10:40 AM IST
Banswada
X

Banswada: రెండు పాఠశాలల్లో గ్రంథాలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జెడ్.పి.హెచ్.ఎస్ కోన బాన్సువాడ, సి.యు.పి.ఎస్ బాయ్స్ స్కూల్ లో నూతన గ్రంథాలయాలను ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం, గ్రంథాలయం విశిష్టత, పుస్తకాల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు. పుస్తకాలు చదివే అలవాటు విద్యార్థుల్లో జ్ఞానం, ఆలోచనా శక్తి, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. గ్రంథాలయం విజ్ఞానానికి ఆలయమని, ప్రతి విద్యార్థి దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్ కు బానిసలు కాకుండా పుస్తకాలతో స్నేహం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, మహ్మద్ ఏజాస్, అలిబిన్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA