Nizamabad: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా పోతంగల్, కోటగిరి, రుద్రూర్ మండలాల్లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాలను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

SALEEM, BANSWADA
Published on: 18 Nov 2026 7:07 AM IST
Nizamabad
X

Nizamabad: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా,పోతంగల్‌ మండల కేంద్రంలోని MMR ఫంక్షన్ హాల్, కోటగిరి మండల కేంద్రంలోని రామాలయం ఫంక్షన్ హాల్, రుద్రూర్‌ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్స్‌లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, గారు,బోధన్ RDO విజయకుమారి ,తహసీల్గార్,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందించడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొంటూ, బాన్సువాడ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం దృష్టి సారిస్తానని చెప్పారు.

ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరాలని, ఏ ఒక్కరూ అనవసరంగా ఇబ్బందులు పడకూడదని, ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA