Pedda Kodapgal: మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు.. భారీగా నష్టం

Pedda Kodapgal: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండలం విట్టల్‌వాడి తండాలో గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టడంతో 150 క్వింటాళ్ల మొక్కజొన్న కాలిపోయి రూ.4.5 లక్షల నష్టం వాటిల్లింది.

VEERANNA, JUKKAL
Published on: 10 Nov 2026 9:15 PM IST
Pedda Kodapgal
X

Pedda Kodapgal: మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని దుండగులు.. భారీగా నష్టం

Pedda Kodapgal: గుర్తు తెలియని దుండగులు నిప్పటించడంతో సుమారు 150 క్వింటళ్ళ మొక్క జొన్న పంటకు నిప్పంటడంతో అరబెట్టిన మొక్క జొన్న పూర్తిగా బూడిద పాలాయి బాధితుడికి 4 లక్షల 50 వేల నష్టం వాటిల్లన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం విట్టల్ వాడి గ్రామ శివారులో చోటు చేసుకుంది.

విట్టల్ వాడి తాండ కు జాదవ్ నాందేవ్ తన 8 ఎకరాల భూమిలో సాగు చేసిన 150 క్వింటళ్ళ మొక్క జొన్న పంటను పంట కోత ముగిశాఖ ఆ పంటను అరబెట్టేందుకు కింద టార్పాలిన్ కవర్ తో అరబెట్టగా మంగళవారం మధ్యాహ్నం ఎవరో గుర్తు తెలియని దుండగుడు పెట్టిన నిప్పు కారణంగా సుమారు 150 క్వింటళ్ళ మొక్క జొన్న పూర్తిగా అగ్నికి అహుతవ్వడంతో బాధితుడికి 4 లక్షల 50 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు జాదవ్ నాందేవ్ తెలిపారు.

మంటలను ఆర్పెందుకు ప్రయత్నించినా స్థానికుల ప్రయత్నం ఫలించకపోవడంతో చూస్తుండగానే కంటిముందు పంట అగ్నికి అహుత్తయింది. అరుగలం కస్టపడి పండించిన పంట దిగుబడి కాస్త రైతు ఆశించిన మేరకు రావడం తో సంతృప్తి చెందిన రైతు పంటకు నిప్పంటి భారీగా నష్టం వాట్లిల్లడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి జి పి ఓ దేవయ్య, సర్పంచ్ బూరి బాయి, శివాజీ రాథోడ్, దీపచంద్ లు చేరుకొని పరిస్థితి పై పర్యవేక్షించి రైతు కు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా సంబంధిత అధికారులకు నివేదిక పంపిస్తామని జి పి ఓ తెలిపారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL