Kamareddy: వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న శేఖపూర్ రైతన్నలు!

Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం శేఖపూర్, పెద్ద ఏక్లారా గ్రామాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట కాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

VEERANNA, JUKKAL
Published on: 30 April 2026 9:49 AM IST
Kamareddy
X

Kamareddy: వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న శేఖపూర్ రైతన్నలు!

Kamareddy: శేఖపూర్ (కామారెడ్డి) రైతన్నల పంట పొలాల్లో ఒక్కసారిగ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వందలాది ఎకరాలలో సాగులో ఉన్న పంటలు కాలి బూడిదైన ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఏక్లారా, శేఖపూర్ గ్రామ శివారులో మొక్క జొన్న పంట పొలాల్లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఎండ కాలం కావడంతో మంటలు వేగంగా వ్యాపించడం కారణంగా వందలాది ఎకరాల పంటలు కాలిపోయి రైతులకు అపర నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మద్నూర్ తహసిల్దార్ ఎం డి. ముజీబ్ మద్నూర్, బాన్సువాడ అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చెయ్యగా ఎంతకు మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు, అగ్ని మాపక సిబ్బంది సమన్వయంతో రాత్రి వరకు ప్రయత్నించి చివరికి మంటలను అదుపు చేసి మరింత నష్టం కాకుండ నివారించారు.

ప్రమాదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో గురువారం అంచనా వేయనున్నారు. మండల స్థాయి అధికారులు అర్ధ రాత్రి వరకు శేఖపూర్ గ్రామంలో ఉండి వేసవిలో పంట వ్యర్థాలు కాల్చవద్దని, అగ్ని ప్రమాదాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ రైతులకు సూచించారు. చేతికి వచ్చిన పంట హార్వెస్టింగ్ సమయంలో ఇలా అగ్నికి ఆహుతవ్వడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. ప్రభుత్వం తమకు జరిగిన పంట నష్టం పై పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రభుత్వం తమను నష్టపరిహారం చెల్లించి అందుకోవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎం ఆర్ ఐ శంకర్,సర్పంచ్ ఇబత్వర్.తుకారాం.సీనియర్ అసిస్టెంట్ రవి, అగ్ని మాపక సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story