Banswada: బాన్సువాడలో రోస్టర్ సవరణ కోరుతూ మాల సంఘం నిరాహార దీక్ష!

Banswada: బాన్సువాడలో రోస్టర్ సవరణ లేదా రద్దు కోరుతూ మాల సంఘం ఆధ్వర్యంలో అయ్యల సంతోష్ నిరాహార దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు.

SALEEM, BANSWADA
Published on: 16 Oct 2026 7:30 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో రోస్టర్ సవరణ కోరుతూ మాల సంఘం నిరాహార దీక్ష!

Banswada: బాన్సువాడ పట్టణ కేంద్రంలో రోస్టర్ సవరణ మరియు రోస్టర్ రద్దు కోరుతూ ,ఈ రోజు ఒక రోజు నిరాహార దీక్ష ను మాల సంఘం ఆధ్వర్యంలో అయ్యల సంతోష్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యల సంతోష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వల్ల రోస్టర్ పాయింట్ లో తీవ్ర అన్యాయం, మాల విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ,రోస్టర్ ను సవరించాలి లేదా రద్దు చేయాలి అని, తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మాలలు అందరూ కాంగ్రెస్కు మాత్రమే ఓటు వేశారు అనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 20 నోటిఫికేషన్ లలో దాదాపు 16 నోటీ నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లలో మాలలకు ఒక్క ఉద్యోగం కూడా లేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించి, మాలలకు న్యాయం చేసే విధంగా రోస్టర్ ను సవరించాలి లేదా రద్దుచెయ్యాలని, నూతన రోస్టర్ విధానాన్ని తీసుకురావాలని అన్నారు. లేని పక్షంలో రాబోయే ఎలక్షన్లలో మాలలకు సపోర్ట్ చేసే పార్టీలకు మాత్రమే మాలలు ఓటు వేస్తారు అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే మాలలు అందరూ అన్ని జిల్లాలో వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన వ్యక్తం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు మల్లూరు సాయిలు, గైని ప్రవీణ్ కుమార్, మాల సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు మల్లూరు సాయిలు, మా డాడీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ అంబేద్కర్ డివిజన్ అధ్యక్షులు ప్రశాంత్, మాజీ ఏఎంసి చైర్మన్ నర్సింలు, బాన్సువాడ మండల అధ్యక్షులు పోతురాజు లింగం,బోగడమీద సాయిలు,మన్నే సాయిలు, శివశంకర్, మొగులజీ తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA