Kamareddy: కామారెడ్డి జిల్లా అన్నారంలో చిరుత సంచారం కలకలం!
Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం అన్నారంలో చిరుత సంచారం. చెరువు కట్టపై ఆనవాళ్లు గుర్తించిన అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
Kamareddy: కామారెడ్డి జిల్లా అన్నారంలో చిరుత సంచారం కలకలం!
Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలో చిరుత సంచారం రోజురోజుకు ప్రజల్లో కలకలం రేపుతోంది. పిట్లం మండలం అన్నారం గ్రామ శివారులో గ్రామా చెరువు కట్టపై రాత్రి సమయంలో చిరుత సంచారించడం గమనించిన కొందరు వ్యవసాయ రైతులు అటవీ అధికారులకు చరవాణి ద్వార సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అన్నారం గ్రామ చెరువు కట్టాకుచేరుకొని చిరుత సంచారించిన ఆనవాలను గుర్తించినట్లు అన్నారం అటవీ బీట్ అధికారి ప్రభు ప్రసన్న కుమార్ తెలిపారు.చిరుత సంచారం నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
చిరుత కదలికలను గుర్తించేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.పంట పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లకుండా గుంపుగుంపులుగా అప్రమత్తం గా వ్యవహారిస్తూ తమ పొలాలకు వెళ్లాలని తాగు సూచనలు చేశారు.




