Jukkal: జుక్కల్‌లో చిరుత సంచారం.. భయం గుప్పిట్లో పరిసర గ్రామాల ప్రజలు!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ నాలా పరివాహక ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బోన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

VEERANNA, JUKKAL
Published on: 27 Nov 2026 3:16 PM IST
Jukkal
X

Jukkal: జుక్కల్‌లో చిరుత సంచారం.. భయం గుప్పిట్లో పరిసర గ్రామాల ప్రజలు!

సావర్ గావ్ ( కామారెడ్డి): జుక్కల్ మండలం కౌలస్ నాల ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచారం ప్రజల్లో కలకాలం రేపుతుంది. జుక్కల్ మండలం సావర్ గావ్ - లింగం పల్లి గ్రామాల మధ్య రోడ్డు పై గల బ్రిడ్జి మీదుగా దెగుల్ వాడి గ్రామానికి చెందిన వ్యక్తి తమ వాహనం లో వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డు పై వచ్చిన చిరుత వ్యక్తి ని దాడి చేయడానికి ప్రయత్నించడంతో భయపడి పోయిన వాహనదారుడు తమ ఫోర్ విల్లర్ వాహన డోర్ లను లాక్ చెయ్యడంతో ప్రాణంతో బయట పడినట్లు వాహనాదరుడు.

సావర్ గావ్ గ్రామ మాజి సర్పంచ్ పవర్ కిసాన్ కు ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడం తో మాజి సర్పంచ్ వెంటనే బిట్ అధికారి రవి కి విషయం చేరవెయ్యడంతో బిట్ అధికారి స్థానికులతో కలిసి చిరుత సంచరించిన ఆనవాలను గుర్తించి నట్లు బిట్ అధికారి రవి తెలిపారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు, తాండ వాసులతోపాటు పరిసర సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.

వీలైతే పలు గ్రామ ప్రజలకు సమాచారం అందించి రాత్రి వేళలో అప్రమత్తం గా వ్యవహారించాలని పలు సూచనలు చేశారు. చిరుత ద్వార ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రాజెక్ట్ తాండ, గ్రామానికి సమీపంలో ఉండడంతో మళ్ళీ చిరుత ఎప్పుడైనా రావచ్చని ప్రజలకు, మూగజీవులకు ఎలాంటి ప్రాణ హాని జరుగకుండా ఉండేందుకు అక్కడక్కడ బోన్ ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL