Bodhan: బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్షాల ధర్నా!
Bodhan: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి.
Bodhan: బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్షాల ధర్నా!
బోధన్: బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట భారత ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు..అనంతరం ఆర్డీవో కార్యాలయాధికారికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల ప్రతినిధులు శంకర్ గౌడ్ వరదయ్యలు మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగిస్తుందని ఈ తొలగింపు ప్రక్రియ అధికార బిజెపి పార్టీకి ఉపయోగపడుతుందని వారు విమర్శించారు. భారత ఎన్నికల కమిషనర్ మోడీ అమిత్ షాల కనుసైగల్లో పని చేస్తున్నాడని ఆరోపించారు. బీహార్, పశ్చిమబెంగాల్ లో సర్ ప్రక్రియ ద్వారా బిజెపి వ్యతిరేక ఓట్లను పెద్ద ఎత్తున తొలగించారని, ఆధారాల తోటి సుప్రీంకోర్టులో బాధితులు పిటిషన్ లు వేశారని గుర్తు చేశారు.
గతంలో సర్ ప్రక్రియ జరిగిన ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు విమర్శలు రాలేదని నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని అన్నారు.భారత ప్రజల ఓట్లను తొలగించడం అంటే వారి ఆత్మను తొలగించడమే అవుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సర్ ప్రక్రియపై విచారణ కమిటీ వేసిందన్నారు.
ఈ నేపథ్యంలో భారత చీఫ్ ఎన్నికల కమిషనర్ తక్షణం రాజీనామా చేయాలని వారుడిమాండ్ చేశారు .దేశవ్యాప్తంగా ఢిల్లీ ,ముంబై కేంద్రంగా సర్ ప్రక్రియ నిలిపివేయాలని ఆందోళనలు జరుగుతున్నాయని యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది అని ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని సర్ ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అమీత్ షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని నియంతృత్వ పద్ధతిలో వ్యతిరేక ఓట్లను తొలగించి శాశ్వతంగా అధికారంలో కొనసాగడానికి కుట్రలో కుయుక్తులు
పన్నుతున్నాయని విమర్శించారు. ఎల్లకాలం నియంత పాలన కొనసాగదని గుర్తు చేశారు. సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ప్రజా తిరుగుబాటు వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ ప్రజాసంఘాల నాయకులు ఏశాల గంగాధర్ ,గంగాధరప్ప , సాయా గౌడ్ ,బండారి గంగాధర్ ,పత్రి ఎల్లయ్య ,జంగం గంగాధర్ గోపి, సుల్తాన్ సాయిలు, గంగామణి, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.




