Banswada: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో బాన్సువాడ యువకుడు!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ యువకుడు అఫ్జల్ ఖాన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నాడు. 15 రోజులుగా సమాచారం లేక కుటుంబం ఆందోళన.
Banswada: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో బాన్సువాడ యువకుడు!
Banswada: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో తాడ్కోల్ యువకుడు అఫ్జల్ ఖాన్ ఆచూకీపై ఆందోళన అంతానికి చేరుకుంది.తనతో ఉన్న మరో సహచర భారతీయ యువకుడు తన ఫోన్ తో వాయిస్ రికార్డులు పంపించడం తో కుటుంబంలో కలవరం.. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వేడుకోలు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన అఫ్జల్ ఖాన్ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అఫ్జల్ ఖాన్‌తో పాటు మరో ముగ్గురు యువకులు యుద్ధ పరిస్థితుల్లో రష్యాలో చిక్కుకున్నట్లు సమాచారం.అఫ్జల్ ఖాన్ గత పదిహేను రోజులుగా ఒక్క ఫోన్ కూడా చేయలేదు.
ఈ నేపథ్యంలో అశోక్ అనే మరో యువకుడి నుంచి వచ్చినట్లు చెబుతున్న వాయిస్ రికార్డు సందేశం అఫ్జల్ ఖాన్ కుటుంబ సభ్యుల్లో మరింత కలవరం రేపింది. ఆ సందేశంలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో, అఫ్జల్ ఖాన్ సురక్షితంగా ఉన్నాడా? లేదా? అన్న విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.
తమ కుటుంబ సభ్యుడి ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారుల ద్వారా అఫ్జల్ ఖాన్ ఆచూకీ కనుగొని, ఆయన సురక్షితంగా ఉంటే స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకవేళ అఫ్జల్ ఖాన్ మృతి చెందినట్లు నిర్ధారణ అయితే, కనీసం ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చి తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే, వాయిస్ రికార్డులో వచ్చిన సమాచారంతో అఫ్జల్ ఖాన్ మృతిపై ఇప్పటివరకు స్పష్టత లేనందున, అధికారిక ధ్రువీకరణ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. తమ కుటుంబ సభ్యుడి ఆచూకీపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించాలని వారు వేడుకుంటున్నారు.




