Banswada: బాన్సువాడలో గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత: ఎస్పీ

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్రకు 200 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 25 Sept 2026 8:34 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో గణేష్ నిమజ్జనానికి భారీ భద్రత: ఎస్పీ

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో ఈ రోజు గణేశుని ఊరేగిపు శోభాయాత్ర,అనంతరం నిమజ్జనాలు జరుగనున్నాయి.దీనికి గాను పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు.

సుమారు 200 మంది పోలీసు బలగాలతో, రెండు డ్రోన్ కెమెరాల తో,రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పెద్ద ఎల్ ఈ డీ స్క్రీన్ పై పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్ పీ రాజేష్ చంద్ర స్వయానా ఉంది పర్యవేక్షణ చేస్తున్నారు.

నిమజ్జనం కోసం అన్ని శాఖల సమన్వయం తో, నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశామని ఎస్ పీ అన్నారు. ప్రజలు, భక్తులు తమకు సహకరించి,ఆనందంగా,సంతోషంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని అన్నారు.అడిషనల్ ఎస్ పీ,స్థానిక డీ ఎస్ పీ తో విఠల్ రెడ్డి,ముగ్గురు సీఐ లు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA