Kamareddy: కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి: అన్నదాతల ఆగ్రహం!

Kamareddy: కామారెడ్డి జిల్లా సంగోజీపేట విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anand Paul, Staff Reporter -Nizambad
Published on: 14 Oct 2026 2:46 PM IST
Kamareddy
X

Kamareddy: కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి: అన్నదాతల ఆగ్రహం!

కామారెడ్డి: విద్యుత్ కోతలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా సంగోజీపేట సబ్ స్టేషన్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. 24 గంటలు విద్యుత్ సరఫరా కావడం లేదని బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన త్రీపేజ్ విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు.

ఎలాపాలా లేని కరెంట్ సరఫరా వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు కోనాపూర్,హనుమాజీపేట, సంగోజీపేట గ్రామాల్లో ఎండిన పంట పొలాలను బాన్సువాడ బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

Anand Paul, Staff Reporter -Nizambad

Anand Paul, Staff Reporter -Nizambad

20 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగి రాజకీయాలు, సామాజిక అంశాలు,స్థానిక సమస్యలపై విస్తృతంగా రిపోర్టింగ్ చేస్తూ విశ్వసనీయమైన వార్తలను పాఠకులకు అందిస్తున్నారు.