Kamareddy: జుక్కల్ మండలంలో ఘోర ప్రమాదం.. ఇసుక ట్రాక్టర్ ఢీకొని మేస్త్రి మృతి!
Kamareddy: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్ శివారులో ఘోర ప్రమాదం. ఇసుక ట్రాక్టర్ ఢీకొని బస్వాపూర్ గ్రామానికి చెందిన మేస్త్రి జలయ్య (60) అక్కడికక్కడే మృతి.
Kamareddy: జుక్కల్ మండలంలో ఘోర ప్రమాదం.. ఇసుక ట్రాక్టర్ ఢీకొని మేస్త్రి మృతి!
Kamareddy: జుక్కల్ (కామారెడ్డి ) జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామ శివారులోని పోల్ట్రీ ఫారం వద్ద ఇసుక ట్రాక్టర్ డికొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మృతికి కారణమైంది. జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బొంబాయి జలయ్య (60) మేస్త్రి ఘటన స్థలంలోనే మృతి చెందడు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లొని మొహమ్మద బాద్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టి వి ఎస్ ఎక్సల్ వాహనం పై బిచ్కుంద నుండి స్వంత గ్రామమైన జుక్కల్ మండలం బస్వాపూర్ కు తన టి వి ఎస్ ఎక్సల్ వాహనం పై వెళ్తుండగామొహమ్మద బాద్ గ్రామ శివారులో వెనుక నుండి వచ్చిన ఇసుక ట్రాక్టర్ డికొనడంతోవ్యక్తి కి తీవ్ర గాయలై ఘటన స్థలం లొనే మృతి చెందడు. ప్రమాదం లో మృతి చెందిన మృతుడు జుక్కల్ మండలం బస్వాపూర్ కు చెందిన వ్యక్తి గా జుక్కల్ పోలీస్ లు గుర్తించారు.సమాచారం అందుకున్న జుక్కల్ పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని పర్సిలిస్తున్నారు. ట్రాక్టర్ తోపాటు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. ఘటన స్థలానికి బస్వాపూర్ గ్రామస్తులు చేరుకొని మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించే వరకు మృతుడి శవాన్ని తరలించేందుకు అంగీకరించబొమంటూ పట్టుబడి కూర్చున్నారు.




